'సమన్వయంతో గణేష్ నిమజ్జనం విజయవంతం చేయాలి': ఆర్డీవో రామకృష్ణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మెదక్

నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆర్డీవో రామకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేయాలని, మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించి నిమజ్జనాలను శాంతియుతంగా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగ కృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.