అనంతపురం జిల్లాలో రోడ్డు పక్కన బోల్తా పడిన పాఠశాల బస్సు

రిపోర్టర్: శివ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. సిద్దరాంపురం రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో సుమారు 25 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రమాద శబ్దం విన్న స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.