'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ': 'గౌడ్‌సాబ్' జాతర పాట విడుదల

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

టాలీవుడ్‌లో విరాట్ రాజ్ హీరోగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ 'గౌడ్‌సాబ్' చిత్రం నుంచి 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' అనే ప్రత్యేక జాతర లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, బోనాల పండుగ వైభవం ఉట్టిపడేలా సాగే ఈ హై-ఎనర్జీ గీతానికి వెంగీ సంగీతం అందించగా, బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో ఆలపించారు. నక్షత్ర మూవీస్ పతాకంపై కల్వకోట వెంకట రమణ మరియు రాజు నిర్మిస్తున్న ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.