పీహెచ్సీ బోర్డుకు ప్లెక్సీ అడ్డం.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

అచ్యుతాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డుకు అడ్డుగా రాజకీయ ప్లెక్సీని ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పీహెచ్సీ పేరు, ఇతర వివరాలు బయటి వారికి కనిపించకుండా పోయాయి.

సమీపంలోనే పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల బోర్డులు స్పష్టంగా కనిపిస్తున్నా, పీహెచ్సీ బోర్డుకు మాత్రం ప్లెక్సీ అడ్డుగా ఉండటం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆ ప్లెక్సీని వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.