జూరాల కింద ఎకరా ఎండినా సర్కార్‌ను వదలం కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: పెబ్బేరు

జూరాల ప్రాజెక్టు కింద ఎకరా ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. పెబ్బేరు రోడ్‌షలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ నల్లమల పులి కాదని, చంద్రబాబు ముందు పిల్లిలా మారుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేస్తూ తెలంగాణ రైతులకు తీరని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.