చీపురుపల్లిలో కాలువ స్థలాల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకుంటాం

రిపోర్టర్: శివ స్థలం: చీపురుపల్లి

చీపురుపల్లి పట్టణ పరిధిలో తోటపల్లి పిల్ల కాలువ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని తహసీల్దార్ బి.సంతోష్కుమార్ తెలిపారు. గజపతినగరం పిల్ల కాలువకు ఆనుకుని ఉన్న విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇంజినీరింగ్ అధికారులను క్షేత్రస్థాయికి పంపి, ఆక్రమణలను పరిశీలించి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాలువ గట్టు మట్టిని తవ్వి తరలించి, స్థలాలను చదును చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.