భోగాపురంలో యువకుడిని రోడ్డుపై ఊరేగించిన ఘటనలో ఐదుగురి అరెస్ట్.
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా భోగాపురంలో బైక్ బాకీ, ప్రమాద పరిహారం చెల్లించలేదనే కక్షతో లారీ డ్రైవర్ రాజేష్‌ను దుస్తులు విప్పి, మెడకు తాడు కట్టి రోడ్లపై అమానుషంగా ఊరేగించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు ప్రధాన నిందితుడు మహేష్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు.