ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంస

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎలాంటి సెలవు తీసుకోకుండా ఇరవై ఐదు ఏళ్లుగా దేశానికి సేవనందిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆయన సేవలను కొనియాడారు. దేశంలో మరియు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.