పెదపాలవలసలో జోరుగా సాగిన టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తెర్లాం
విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని పెదపాలవలస గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మజ్జి సిరి సహస్ర ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. స్థానిక సమస్యలపై చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.