ప్రొద్దుటూరు వేదికగా జల్ జీవన్ మిషన్ ప్రారంభం: చంద్రబాబు కీలక ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: ప్రొద్దుటూరు

దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు చరమగీతం పాడేలా రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా సోమవారం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ గడపకూ సురక్షితమైన తాగునీరు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.