'భారీ బ్యాటరీతో గెలాక్సీ ఏ08': శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్

రిపోర్టర్: శివ స్థలం: World

ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ఎంట్రీ-లెవెల్ సెగ్మెంట్‌లో గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో సైలెంట్‌గా విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో పాటు 6,000 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ వస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ మార్కెట్‌లో 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 23,000 వరకు ఉంది.