రామన్నపేట జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ జగదీశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంపై వక్తలు ప్రసంగించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువత సమాజ అభివృద్ధికై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.