కీటకాలతో చాక్లెట్ ఐస్‌క్రీమ్: ఇండోనేషియా విద్యార్థిని వినూత్న ప్రయోగంపై సోషల్ మీడియాలో చర్చ
రిపోర్టర్: సురేష్
స్థలం: జకార్తా
ఇండోనేషియాలోని జకార్తా నగరంలో ఉన్న ఐ3ఎల్ విశ్వవిద్యాలయ విద్యార్థిని ఆండ్రియా జెఫానీ కీటకాలను ఉపయోగించి చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి సంచలనం సృష్టించారు. కీటకాల్లో అత్యధిక ప్రోటీన్లు లభిస్తాయని, వాటిని ప్రయోగశాలలో సులభంగా పెంచవచ్చని ఆమె తెలిపారు. తన థీసిస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టినట్లు ఆండ్రియా వివరించగా, నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.