నంద్యాల జిల్లాలో ఉద్రిక్తత: రీకౌంటింగ్ ప్రక్రియపై వైసీపీ శ్రేణుల ఆందోళన

రిపోర్టర్: విజయ్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయితీ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతోనే మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ రీకౌంటింగ్ కు ఆదేశించారని ఆరోపిస్తూ వారు ధర్నా నిర్వహించారు. బ్యాలెట్లు మార్చే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేయగా, పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.