MSME రంగానికి ప్రత్యేక మెంటర్‌గా రాజీవ్ తల్రేజా నియామకం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రముఖ టెక్ సంస్థ ASUS ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్పర్ట్ సిరీస్ పీసీల ద్వారా సురక్షితమైన వ్యాపార వాతావరణాన్ని అందించేందుకు క్వాంటమ్ లీప్ వ్యవస్థాపకుడు, MSME నిపుణుడు రాజీవ్ తల్రేజాను ప్రత్యేక మెంటర్‌గా నియమించుకున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వ్యాపారవేత్తలకు సాంకేతికతపై అవగాహన కల్పించనున్నారు.