వరంగల్ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మాజీ మంత్రి కొండా సురేఖ
రిపోర్టర్: అశోక్
స్థలం: వరంగల్
దసరా మరియు సద్దుల బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై వరంగల్లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మాజీ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రంగలీల మైదానం, ఉర్సు గుట్ట, కరీమాబాద్ ప్రాంతాలలో నిర్వహించనున్న రావణ వధ కార్యక్రమం, ఉత్సవాలు బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.