తెలంగాణలో వ్యాపారాలకు ఊరటనిస్తూ ప్రజా విశ్వాస సవరణ బిల్లు ఆమోదం

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీలో ప్రజా విశ్వాస నిబంధన సవరణ బిల్లు ఆమోదం పొందింది. చిన్నపాటి పొరపాట్లకు గతంలో ఉన్న కఠిన శిక్షలను రద్దు చేసి, కేవలం జరిమానాలు మాత్రమే విధించేలా కొత్త చట్టం తెచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరించగా, ఎంఐఎం సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ చట్టంతో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.