పంట రుణాలు మాఫీ చేయాలి! కరువు సహాయక చర్యలు చేపట్టాలి,

రిపోర్టర్: Laxman Regam స్థలం: దేవరాపల్లి

దేవరాపల్లి,రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని. కరువు సహయక చర్యలు చేపట్టాలని విస్తృతంగా ఉపాధి హామీ పనులు కల్పించాలని కరువు పై ముందస్తు చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రక టించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు,ఆదివారం పార్టీ మండలస్తాయి సమావేశం సిపిఎం మండల కార్యదర్శి బిటి దొర అద్యక్షతన జరిగింది, అనంతరం అయిన మాట్లా డారు లెనినో ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పులు వలన వర్షాభావ పరిస్థితులు నెల కొని ఈసంవ త్సరం ఖరీఫ్ సీజన్ సాగు పూర్తిగా దెబ్బ తిందని ఇట్టి పరిస్థితి లలో తక్షణమే అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతు పెట్టు బడులు పెట్టి వేసి నసిన వరి నారు మళ్లు పూర్తిగా ఎండి పోయాయని, ప్రస్తుతం వర్షాలు కురిసినా ఇప్పటికే నష్ట పోయిన రైతులకు పెద్దగా ప్ర యోజనం ఉండదని తెలిపారు జిల్లాలో నెల కొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు రైతులు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి వేలాది రూపాయలు ఖర్చు చేసి దుక్కులు దున్నించి, విత్తనాలు కొనుగోలు చేసి నారుమళ్లు పోశారని తెలిపారు. అనంతరం నాట్లు వేసేందుకు సిద్ధమైన సమయంలో సరైన వర్షాలు లేక పోవడంతో నారుమళ్లు ఎండి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారని పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవక పోవడంతో పెట్టు బడులు పూర్తిగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సాగు కోసం అప్పులు చేసి పెట్టు బడులు పెట్టిన రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జిల్లాలో క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం అందించాలని కోరారు పంటలు సాగు చేయలేక నష్టపోయిన రైతులపై రుణభారం పడ కుండా రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు అవసరమైన విత్తనాలు, ఇతర వ్యవసాయ సహాయాన్ని ప్రభుత్వం అందించి రుణాలు మంజూరు చేయాలన్నారు అలాగే పంట నష్టాల కారణంగా రైతులకు కొత్తగా సాగు పెట్టుబడులు సమకూర్చు కోవడం కష్టంగా మారిందని, బ్యాంకుల ద్వారా వారికి కొత్త రుణాలను మంజూరు చేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు విబి జీరాంజీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు విస్తృతంగా ఉపాధి పనులు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు అత్యవసర చర్యలు చేప ట్టాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితులను అధికా రికంగా గుర్తించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టడం తోపాటు రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని రైతు కూలీలను ఆదు కోవాలని తక్షణమే అనకాపల్లి జిల్లా ను కరువు జిల్లాగా ప్రక టించాలని డిమాండ్ చేశారు.ఈకార్య క్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న టి శంకర్ బి నాగేశ్వరరావు జె పోతురాజు యం ఎర్రునాయుడు జె ఈశ్వరావు వి దోంగ బాబు కె సన్యాసినాయుడు జె దేముడు జె ఈశ్వరావు,తదితరులు పాల్గొన్నారు