ఖైదీల ఆహార నాణ్యత పరిశీలన: నర్సంపేట జైలులో సీనియర్ జడ్జి తనిఖీలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట ప్రత్యేక మహిళా కారాగారంలో ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యతను సీనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సిహాగ్ పరిశీలించారు. భోజనం తయారీ విధానం, పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను స్వయంగా తనిఖీ చేశారు. ఖైదీలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించారు. ఆహారం రుచిపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో న్యాయాధికారి మహమ్మద్ యూసఫ్, జైలు అధికారులు పాల్గొన్నారు.