హైదరాబాద్ పాతబస్తీలో దారుణం: కత్తితో పొడిచి యువకుడి హత్య

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్బాబానగర్ లో తెల్లవారుజామున జరిగిన కత్తి దాడిలో సయ్యద్ ఒమర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని, అడ్డుకోబోయిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.