మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు యువకులు దుర్మరణం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

మహారాష్ట్రలోని అమరావతి సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. సమృద్ధి మహామార్గ్ పై ఓ ట్రక్కు, పికప్ వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. దసరా పండుగ నిమిత్తం అమ్మవారి విగ్రహాన్ని తెచ్చేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.