ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల్లో విధులను నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్ల దీర్ఘకాలిక విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్‌ను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్‌సర్జన్లకు 10 శాతం, పీజీ వైద్య విద్యార్థులకు 5 శాతం, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేస్తున్న వైద్యులకు 3.5 శాతం చొప్పున అలవెన్సులు పెరగగా, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు రూ.34.08 కోట్ల అదనపు భారం పడనుంది.