గోరుకల్లులో ఆకతాయిల చేష్టలతో రిజర్వాయర్ గేటు ఎత్తివేత

రిపోర్టర్: సునీల్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‍ఫాల్ రెగ్యులేటర్ గేటును మంగళవారం తెల్లవారుజామున ఆకతాయిలు ఎత్తడంతో గ్రామంలోకి భారీగా నీరు పోటెత్తింది. కట్ట తెగిందన్న ప్రచారంతో భయపడిన గ్రామస్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు కొండపైకి పరుగులు తీశారు. అయితే ఓ ఎలక్ట్రీషియన్ అప్రమత్తంగా వ్యవహరించి గేటును మాన్యువల్‍గా దించడంతో పెనుముప్పు తప్పిందని అధికారులు తెలిపారు.