అనారోగ్య బాధితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని అనిత పిలుపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనకాపల్లి

అనారోగ్యం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందుతున్న ఆర్థిక సహాయం కొంత ఊరటనివ్వడం ఎంతో సంతోషంగా ఉందని అనకాపల్లి నేత వంగలపూడి అనిత పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిగా అందేలా క్షేత్రస్థాయిలో నిరంతరం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తూ అండగా నిలుస్తోందని ఆమె ఈ సందర్భంగా వివరించారు.