'సమరయోధుల త్యాగాలు మరువలేం': ఈటల రాజేందర్ నివాళులు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం రజాకార్ల పాలన నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలర్పించిన నాటి సమరయోధుల త్యాగాలను, వారి అచంచల పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈటల రాజేందర్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఈటల రాజేందర్ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అమరుల ఆశయ సాధనకు అందరం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.