రైతు బడి ద్వారా నూతన ఒరవడిని తీసుకురావాలన్న హరీష్ రావు ఆఫీస్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్ ప్రాంతంలో రైతు బడి గ్రూప్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు వ్యవసాయ రంగంపై కీలక ప్రసంగం చేశారని హరీష్ రావు ఆఫీస్ వెల్లడించింది. బడి అంటే కేవలం తరగతి గది, విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని, ఆ బడిలోనే అక్షరజ్ఞానంతో పాటు లోకజ్ఞానాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.