భార్య ఫోన్ కాల్స్‌తో చిక్కిన హైవే దొంగల ముఠా
రిపోర్టర్: శివ
స్థలం: తమిళనాడు
తమిళనాడులో హైవేలపై బస్సు ప్రయాణికుల బంగారు ఆభరాణాలు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వస్తున్న భర్తకు భార్య పదేపదే చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా మొబైల్ టవర్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసిన పోలీసులు, మధ్యప్రదేశ్ కు చెందిన ప్రధాన నిందితుడు మక్సూద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఐదు ప్రాంతాల్లో 173 కాసుల బంగారాన్ని దోచుకున్నట్లు గుర్తించి పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.