విజయనగరంలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న సిరిసహస్ర ప్రత్యేక పూజలు
రిపోర్టర్: Jagadeesh Jagadeesh
స్థలం: విజయనగరం
విజయనగరం నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని తెలుగుదేశం పార్టీ నాయకురాలు సిరమ్మ మంగళవారం ఘనంగా దర్శించుకున్నారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి యూత్ సభ్యులు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.