బెల్లంపల్లి డివిజన్ ఎన్నికల కన్వీనర్‌గా రేణికుంట్ల శ్రీనివాస్ నియామకం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ముక్తా శ్రీనివాస్, నలుమాసు కాంతయ్య హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలోని వివిధ పట్టణ, మండల సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి డివిజన్ ఎన్నికల కన్వీనర్‌గా మాజీ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే నెల రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నూతన సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున పెంచాలని నాయకులు పిలుపునిచ్చారు.