పాలకొండ అభివృద్ధి లక్ష్యంగా ఇంటింటా జోరుగా రాజేశ్వరి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ పట్టణంలోని ఇరవై ఆరో వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి చాపల రాజేశ్వరి ఇంటింటా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. వార్డులోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. వార్డు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, తనను గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు ఆశీస్సులతో ప్రచారాన్ని కొనసాగిస్తూ, ప్రజల మద్దతు కోరుతున్నారు.