పులివెందులలో వైసీపీని ప్రజలే పూర్తిగా మడతపెట్టారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: పులివెందుల

పులివెందులలో వైసీపీని ప్రజలు మడతపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదు దశాబ్దాల తర్వాత అక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు. జగన్ రాజకీయ డ్రామాలు ఆపాలని, గతంలో చొక్కా మడతపెడితే అధికారం కోల్పోయారని, ఇప్పుడు ఆ పార్టీనే మడతపెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.