బెంగళూరులో కారులో విగతజీవుడిగా రియల్టర్ సలీమ్ అక్బర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కర్ణాటక
బెంగళూరులోని కోరమంగళ పోలీసు స్టేషన్ సమీపంలో నిలిపివుంచిన ఆడి కారులో సలీమ్ అక్బర్ ఎస్ అనే 46 ఏళ్ల రియల్టర్ విగతజీవుడిగా కనిపించారు. కొడగుకు చెందిన ఆయన కారులోనే మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, మృతదేహాన్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.