ఆర్టీఐ దుర్వినియోగంపై రాష్ట్ర సమాచార కమిషన్ సంచలన నిర్ణయం: దరఖాస్తులపై నిషేధం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

సమాచార హక్ కు చట్టాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు మరియు అధికారులను వేధించేందుకు ఉపయోగిస్తే ఉపేక్షించబోమని రాష్ట్ర సమాచార కమిషనర్ పీఎస్ నాయుడు స్పష్టం చేశారు. ఒకే తరహా ప్రశ్నావళితో పదేపదే దరఖాస్తులు సమర్పిస్తూ ప్రభుత్వ కార్యాలయాలపై అనవసర భారం మోపుతున్న ముద్దుకొండయ్య అనే కార్యకర్తపై కొత్త దరఖాస్తులు, అప్పీళ్లు దాఖలు చేయకుండా కమిషన్ తాజాగా నిషేధం విధించింది. ఆర్టీఐ చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన తేల్చిచెప్పారు.