రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ గౌరవ్ వల్లభ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ నేత గౌరవ్ వల్లభ్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ తన వైఖరిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన చెబుతున్నదానికి, పార్టీ ఇస్తున్న వాగ్దానాలకు పొంతన లేదని విమర్శించారు. రాహుల్ వెనుక ఉన్న ఆ ఐదుగురు ఎంపీలు ఏమయ్యారని ఆయన నిలదీశారు. తెరవెనుక కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకాలు ప్రజలకు అర్థమవుతున్నాయని గౌరవ్ వల్లభ్ ఎద్దేవా చేశారు.