భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగిన ఆర్యవైశ్యుల బోనాల ఉత్సవాలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యులు బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మడి దుస్తులతో ప్రత్యేకంగా నైవేద్యం సిద్ధం చేసి బోనంకుండలో ఏర్పాటు చేసి అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు సామూహికంగా గడికోటలోని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుఖశాంతులతో వర్ధిల్లాలని, వానలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.