ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామన్న తహసీల్దార్

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

కొయ్యూరు మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రసాదరావు హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించి భూములు ఆక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణలను స్వయంగా తొలగించుకోవాలని, లేదంటే రెవెన్యూ శాఖ తరఫున కూల్చివేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.