బిగ్ బాస్ హౌస్లో దేబ్జానీ తీరుపై నాగార్జున ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ తాజా వీకెండ్ ప్రోమోలో హౌస్ కంటెస్టెంట్ దేబ్జానీ వ్యవహారశైలిపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నిర్వాహకులు తెలిపారు. నరేష్ను పొట్టోడు అని సంబోధించడం తప్పని, అతను ఎంతగానో బాధపడ్డాడని నాగార్జున తప్పుపట్టారు. దేబ్జానీ చేసిన వ్యాఖ్యలపై వీడియో ఆధారంగా క్లాస్ పీకడంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో త్రిగుణ్ సరైన విధానంలో ఆడాడని నిరూపించే వీడియోను ప్రదర్శిస్తూ వర్షిణికి కూడా నాగార్జున గట్టిగా హెచ్చరించినట్లు ప్రోమో స్పష్టం చేస్తోంది.