భక్తిపారవశ్యంతో పులకించిన శ్రీ వెంకయ్య స్వామి సప్తగిరి శిఖరాలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని చెల్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసియున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసులు వెంకయ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా గందల కిష్టయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పెద్ద ప్రసాదాలు స్వీకరించడం జరిగినది.