రామాపురం గ్రామంలో పల్లె నిద్ర కాశీబుగ్గ డి ఎస్ పి టి భవాని

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు శనివారం రాత్రి మందస మండలం రామాపురం గ్రామంలో కాశీబుగ్గ డీఎస్పీ శ్రీమతి టి. భవాని గారు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ గారు గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, పోలీసుల దృష్టికి నిర్భయంగా తీసుకురావాలని, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

గ్రామంలో శాంతిభద్రతలు, మహిళలు మరియు బాలల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులతో సహకరించి గ్రామాన్ని నేర రహితంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని డీఎస్పీ టి. భవాని కోరారు.