ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ముఖ్య అతిథి!

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న 'ఎపిక్' సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లోని ఐటీసీ కొహినూర్‌లో ఘనంగా జరగనుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర వేడుకకు ముఖ్య అతిథిగా హీరోయిన్ రష్మిక మంధాన హానున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.