పర్యావరణ మైత్రికి బాట వేస్తూ మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని పట్టణ ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల ప్రకృతికి జరిగే హానిని నివారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మారుతి రాజ్, గోలి రాము, కస్తూరి సతీష్, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.