రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు భక్తులు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో సాలసార్ బాలాజీ ఆలయానికి కాలినడకన వెళ్తున్న ముగ్గురు యువకులు గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం చెందారు. జయాల్ ప్రాంతం నుంచి దాదాపు 80 మంది సభ్యులతో కూడిన బృందం యాత్ర ప్రారంభించింది. ఆలయానికి కిలోమీటరు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.