గన్నవరం సీఐపై టీడీపీ కార్యకర్త తీవ్ర ఆరోపణల వీడియో వైరల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా గన్నవరం సీఐ శివప్రసాద్ తీరుపై టీడీపీ కార్యకర్త నాగయ్య రుషి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఐ రూ.20 కోట్లు లంచాలు వసూలు చేశారని, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాటను సైతం లెక్కచేయకుండా పసుపు చొక్కా అంటూ కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.