తమిళనాడు ముఖ్యమంత్రి లండన్ పర్యటనపై బీజేపీ, డీఎంకే నేతల తీవ్ర విమర్శలు
రిపోర్టర్: సతీష్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ లండన్ పర్యటనపై బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లే బదులు కోయంబత్తూర్, మధురైలలోని స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలని బీజేపీ నేత సూచించగా, లండన్లో ఎలాంటి పెట్టుబడులు తెచ్చారని స్టాలిన్ ప్రశ్నించారు. అయితే ఈ పర్యటన ద్వారా రూ.15,300 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది.