బ్రిక్స్ దేశాలు శాంతికి పాటుపడాలని జిన్ పింగ్ పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు బ్రిక్స్ దేశాలు అగ్రగామి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్య యుద్ధం వల్ల తీవ్ర ప్రాణనష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సభ్య దేశాల మధ్య మరింత సహకారం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.