అల్లూరి జిల్లాలో కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

రిపోర్టర్: అశోక్ స్థలం: అల్లూరి సీతారామరాజు

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద వరద ఉద్ధృతికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో గిరిజన ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.