ముంబైలో ప్రసిద్ధ కేఫ్ మోండేగర్ లైసెన్స్ రద్దు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని ప్రముఖ 94 ఏళ్ల చరిత్ర కలిగిన కేఫ్ మోండేగర్ లైసెన్స్‌ను ఆహార భద్రతా నియమాలు పాటించనందుకు ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. శుభ్రత లోపాలు మరియు నిర్మాణపరమైన ఉల్లంఘనల కారణంగా ఈ చర్య తీసుకున్నారు. దీనితో పాటు నగరంలోని మరో తొమ్మిది ప్రముఖ బేకరీలు, డెయిరీలు మరియు స్వీట్ షాపుల లైసెన్స్‌లను కూడా అధికారులు నిలిపివేశారు.