ఢిల్లీలో కొత్త ఫుట్పాత్ డిజైన్: హైహీల్స్ నడకపై నెట్టింట తీవ్ర చర్చ
రిపోర్టర్: రమేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త రకం రంధ్రాల ఫుట్పాత్ డిజైన్ వివాదాస్పదమైందని సోషల్ మీడియా వినియోగదారులు వెల్లడించారు. హైహీల్స్ వేసుకునే మహిళలకు, చిన్నారులకు, నడవలేని వారికి ఇవి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ప్రత్యేక బ్లాకులతో ప్రభుత్వం చేపట్టిన ఈ పనులపై ప్రజల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.