బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అత్యంత హాస్యాస్పదం: తలసాని శ్రీనివాస్ యాదవ్
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అసెంబ్లీలో లేని వారి పేర్లను కూడా సస్పెన్షన్ జాబితాలో చేర్చడం శాసనసభా చరిత్రలోనే అత్యంత హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.