స్థానిక ఎన్నికలు: ఏపీలో ప్రతిపక్షానికి షాక్, పన్నెండు స్థానాలు ఏకగ్రీవం

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు అనూహ్య ఆధిక్యత సాధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ల దాఖలులో వైఎస్సార్సీపీ విఫలమవడం మరియు కొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరించబడటంతో పన్నెండు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూటమి పరం కానున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కంచుకోటల్లోనూ విపక్ష పార్టీ అభ్యర్థులు బరిలో నిలవకపోవడం లేదా అనర్హులవడంతో ఎన్నిక ముందే కూటమి విజయం ఖరారైంది.